AP EAPCET 2026 | ఏపీ ఈఏపీసెట్ సిలబస్ ఇదిగో.. మాక్ టెస్టులు రాస్తారా?
ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ పరీక్ష(AP EAPCET 2026)కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.
By Education News Team
Updated : 05 Feb 2026 16:26 IST
https://results.eenadu.net/education-news/AP-EAPCET-2026-syllabus-and-Mock-tests
ఇంటర్నెట్ డెస్క్: ఏపీలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ పరీక్ష(AP EAPCET 2026)కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కాగా.. ఈ నెల 4వ తేదీ నుంచి మార్చి 7వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష సిలబస్‌ని వెబ్‌సైట్‌లో పెట్టిన అధికారులు.. అభ్యర్థులు ప్రాక్టీస్ చేసేందుకు వీలుగా మాక్‌టెస్టులనూ అందుబాటులో ఉంచారు.
ఇంజినీరింగ్ స్ట్రీమ్ సిలబస్ కోసం క్లిక్ చేయండి
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ సిలబస్
ఆలస్య రుసుంతో మార్చి 26 వరకు..
మే 12 నుంచి 20 వరకు జరగనున్న ఈఏపీసెట్ పరీక్షకు రూ.1000 ఆలస్య రుసుంతో మార్చి 12 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అధికారులు అవకాశం కల్పించారు. అలాగే, రూ.2వేల ఆలస్య రుసుంతో మార్చి 17వరకు; రూ.4వేల ఆలస్య రుసుంతో రుసుంతో మార్చి 21 వరకు; రూ.10వేల రుసుంతో మార్చి 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు మార్చి 26 నుంచి 28వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. పరీక్ష హాల్‌టికెట్లను ఏప్రిల్ 28 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 23న ప్రిలిమినరీ కీ విడుదల చేసి 25వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. జూన్ 1న ఫలితాలు విడుదల చేయనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
ఈఏపీసెట్ మాక్ టెస్ట్ (ఇంజినీరింగ్) కోసం క్లిక్ చేయండి
ఈఏపీసెట్ మాక్ టెస్ట్ (అగ్రికల్చర్, ఫార్మసీ) కోసం క్లిక్ చేయండి