Postal Jobs | పోస్టల్‌లో 28వేల పోస్టులకు దరఖాస్తులు షురూ.. మీ డివిజన్‌లో ఎన్ని ఖాళీలో చెక్‌ చేసుకోండిలా!

Postal Jobs | పోస్టల్‌లో 28వేల పోస్టులకు దరఖాస్తులు షురూ.. మీ డివిజన్‌లో ఎన్ని ఖాళీలో చెక్‌ చేసుకోండిలా!

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిల్స్‌లో ఖాళీగా ఉన్న దాదాపు 28,740 గ్రామీణ డాక్ సేవక్(GDS) పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే.

Eenadu icon
By Education News Team Updated :02 Feb 2026 18:56 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిల్స్‌లో ఖాళీగా ఉన్న దాదాపు 28,740 గ్రామీణ డాక్ సేవక్(GDS) పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. రాత పరీక్ష, ఇంటర్వ్యూ వంటివేమీ లేకుండా కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా చేపట్టే ఈ పోస్టుల భర్తీకి సోమవారం (ఫిబ్రవరి 2) నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నారు. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఆన్‌లైన్‌ ఓటీఆర్‌కు అవకాశం ఇచ్చిన అధికారులు.. ఫిబ్రవరి 2 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు, ఫీజు చెల్లింపు చేసుకొనేందుకు అనుమతిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌/ దరఖాస్తుల్లో ఏవైనా కరెక్షన్లు ఉంటే ఫిబ్రవరి 18, 19 తేదీల్లో చేయవచ్చని సూచించారు. ఈ పోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం)/ డాక్‌ సేవక్‌ హోదాల్లో సేవలందించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి

తెలుగు రాష్ట్రాల్లో డివిజన్ల వారీగా ఖాళీలు ఇలా.. 

రాష్ట్రాల వారీగా సర్కిళ్లు/ ఏయే డివిజన్‌లో బీపీఎం, ఏబీపీఎం/డాక్‌సేవ్‌ ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో, పోస్టు క్యాడర్‌, వేతనం, రిజర్వేషన్‌ కేటగిరీ వంటి పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దీని ప్రకారం.. ఏపీ సర్కిల్‌లో అమలాపురం (23 పోస్టులు), అనకాపల్లి (48), అనంతపురం(46), భీమవరం (53), చిత్తూరు (46), కడప (26), ఏలూరు (27), గుడివాడ (25), గూడూరు (31), గుంటూరు (19), హిందూపుర్‌ (31), కాకినాడ (23), కర్నూలు (59), మచిలీపట్నం (10), మార్కాపుర్‌ (47), నంద్యాల (26), నరసరావుపేట (48), నెల్లూరు (50), పార్వతీపురం (38), ప్రకాశం (52), ప్రొద్దుటూరు (32), రాజమండ్రి (36),  ఆర్‌ఎంఎస్‌ ఏజీ డివిజన్‌ (12), ఆర్‌ఎంఎస్‌ వై డివిజన్‌ (6), శ్రీకాకుళం (70), తాడేపల్లిగూడెం (28), తెనాలి (20), తిరుపతి (53), విజయవాడ (38), విశాఖ (9), విజయనగరం (28) డివిజన్లలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డివిజన్ల వారీగా పోస్టుల వివరాలను ట్రాక్‌ చేసేందుకు  Vacant Posts విభాగంలోకి వెళ్లి చూసుకోవచ్చు. 

డివిజన్ల వారీగా ఖాళీలు తెలుసుకొనేందుకు క్లిక్‌ చేయండి

అలాగే, తెలంగాణ సర్కిల్‌లో ఆదిలాబాద్‌ (54), హన్మకొండ (28), హైదరాబాద్‌ సిటీ (10), హైదరాబాద్‌ షార్టింగ్‌ (8), హైదరాబాద్‌ సౌత్‌ ఈస్ట్‌ (16), కరీంనగర్‌ (25), ఖమ్మం (98), మహబూబ్‌నగర్‌ (45), మెదక్‌ (24), నల్గొండ (32), నిజామాబాద్‌ (50), పెద్దపల్లి (32), సంగారెడ్డి (19), సికింద్రాబాద్‌ (54), సూర్యాపేట (28), వనపర్తి (44), వరంగల్‌ (36) చొప్పున ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 

వేతనం ఎంత?

బీపీఎం పోస్టులకు ఎంపికైన వారికి నెలకు వేతనం రూ.12వేలు నుంచి 29,380;  ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు రూ.10,000 - రూ.24,470 చొప్పున చెల్లిస్తారు. ఈ పోస్టులకు వయో పరిమితిని 18 ఏళ్లు నుంచి గరిష్ఠంగా 40 ఏళ్లుగా నిర్ణయించారు.  ఆయా వర్గాల ఆధారంగా వయో సడలింపు అవకాశం కల్పించారు.  జీడీఎస్‌ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు , గరిష్ఠంగా ఐదు గంటలు  పనిచేస్తే సరిపోతుంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ నోటిఫికేషన్‌పై క్లిక్‌ చేసి తెలుసుకోవచ్చు.