Polycet 2026 | తెలంగాణ పాలిసెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం.. పాత ప్రశ్నపత్రాలివిగో!

Polycet 2026 | తెలంగాణ పాలిసెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం.. పాత ప్రశ్నపత్రాలివిగో!

తెలంగాణలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (Polycet-2026)కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.

Eenadu icon
By Education News Team Updated :03 Feb 2026 18:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తెలంగాణలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (Polycet-2026)కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.  పదోతరగతి పాసైన విద్యార్థులు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు మే 13న పాలిసెట్‌ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఫిబ్రవరి 2 నుంచి ఏప్రిల్‌ 20వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి తెలిపింది.

రిజిస్ట్రేషన్ల కోసం క్లిక్‌ చేయండి

ఈసారి అకస్మాత్తుగా పాలిసెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన అధికారులు.. ఫిబ్రవరి 2 నుంచే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయితే, ఫిబ్రవరి 2 రాత్రికి కూడా వెబ్‌సైట్‌ తెరుచుకోకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. తాజాగా అప్లికేషన్‌ విండో ఓపెన్‌ కావడంతో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, గత ఆరేళ్ల ప్రశ్నపత్రాలను సైతం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

  • దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.250; ఇతరులకు రూ.500
  • రూ.100 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 21వరకు; రూ.300  తత్కాల్‌ రుసుంతో ఏప్రిల్‌ 22వరకు దరఖాస్తుకు గడువు ఇచ్చారు.
  • ఫలితాలు: పరీక్ష ముగిసిన 12 రోజుల తర్వాత రిజల్ట్స్‌ విడుదల చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులో ఏదైనా ఇబ్బంది ఎదురైతే 08031404549 ఫోన్‌ నంబర్‌ లేదా polycet-te@telangana.gov.in మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు.

  • పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అందించే కోర్సులు, పరీక్షా సరళి, సిలబస్‌, దరఖాస్తు చేసే ప్రక్రియ, హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌, ప్రవేశ పరీక్షలో అడిగే మోడల్‌ ప్రశ్నలు తదితర పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.