APPSC Group-1 Results | ఏపీపీఎస్సీ గ్రూప్-1 తుది ఎంపిక జాబితా విడుదల
గ్రూప్-1 తుది ఎంపిక జాబితాను ఎట్టకేలకు ఏపీపీఎస్సీ (APPSC Group-1) విడుదల చేసింది.
By Education News Team
Updated :30 Jan 2026 21:10 IST
https://results.eenadu.net/education-news/APPSC-Group-1-final-selection-list-released
ఇంటర్నెట్ డెస్క్: గ్రూప్-1 తుది ఎంపిక జాబితాను ఎట్టకేలకు ఏపీపీఎస్సీ (APPSC Group-1 results) విడుదల చేసింది. 87 గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాల కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వివిధ కేటగిరీల్లో పోస్టులకు ప్రాథమికంగా ఎంపిక చేసిన వారి హాల్టికెట్ నంబర్లతో కూడిన జాబితాతో పాటు ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇతర వివరాలను అధికారులు వెబ్సైట్లో పొందుపరిచారు. రిజర్వేషన్ రోస్టర్ కేసులో స్టే లేకపోవడం, న్యాయస్థానం ఆదేశాలకు లోబడి ఫలితాలు వెల్లడించేందుకు హైకోర్టు అనుమతించడంతో ఈ ఫలితాలను అధికారులు ప్రకటించారు.
ఎంపిక జాబితా కోసం క్లిక్ చేయండి
గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ 2023 డిసెంబరు 8న ప్రకటన విడుదల చేయగా.. 2024 మార్చి 17న ప్రిలిమ్స్ నిర్వహించింది. 2025 మేలో మెయిన్స్ నిర్వహించి, జూన్లో ఫలితాలు విడుదల చేసింది. జూన్ 23 నుంచి జులై 15 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎట్టకేలకు శుక్రవారం రాత్రి తుది ఎంపిక జాబితాను వెలువరించింది.