CBSE Admit Cards | సీబీఎస్ఈ 10, 12 పరీక్షలకు అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్లోడ్ ఇలా..
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పది, 12వ తరగతి పరీక్షల అడ్మిట్ కార్డులు (CBSE Admit Cards 2026) విడుదలయ్యాయి.
By Education News Team
Updated : 03 Feb 2026 14:45 IST
https://results.eenadu.net/education-news/CBSE-Admit-Card-2026-Released
ఇంటర్నెట్ డెస్క్: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పది, 12వ తరగతి పరీక్షల అడ్మిట్ కార్డులు (CBSE Admit Cards 2026) విడుదలయ్యాయి. ఫిబ్రవరి 17 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానుండటంతో అధికారులు మంగళవారం హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు. పరీక్ష సంగమ్ పోర్టల్‌లో లాగిన్ కావడం ద్వారా ఆయా పాఠశాలలు రెగ్యులర్ విద్యార్థుల అడ్మిట్ కార్డుల్ని డౌన్లోడ్ చేయొచ్చు. యూజర్ ఐడీ, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి వీటిని పొందొచ్చు. అడ్మిట్ కార్డులో రోల్ నంబర్, పరీక్ష కేంద్రం పేరు, రిపోర్టు చేయాల్సిన సమయంతో పాటు విద్యార్థులకు పలు కీలక సూచనలు ఉంటాయి.
డౌన్లోడ్ ఇలా..
- తొలుత cbse.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- Parikshasangam portalపై క్లిక్ చేయాలి.
- అక్కడ అడ్మిట్ కార్డు, సెంటర్ మెటీరియల్ ఫర్ మెయిన్ ఎగ్జామ్ 2026 లింక్‌పై క్లిక్ చేయాలి.
- పదో తరగతి, 12వ తరగతి అడ్మిట్ కార్డు లింక్‌పై క్లిక్ చేయాలి
- యూజర్ ఐడీ, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డు పొందొచ్చు.
పాఠశాలల లాగిన్ ద్వారా మాత్రమే అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్‌కు సీబీఎస్ఈ అవకాశం కల్పించింది. ప్రిన్సిపల్స్, ఆథరైజ్డ్ స్కూల్ అధికారులు ఎగ్జామ్ సంగమ్ పోర్టల్‌లో తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నాక పాఠశాలలు అందులో సమాచారం మొత్తాన్ని జాగ్రత్తగా వెరిఫై చేయాలి. విద్యార్థుల చేతికి ఇచ్చే అడ్మిట్ కార్డుపై ప్రిన్సిపల్ సంతకం, పాఠశాల సీల్ ఉండటం తప్పనిసరి. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11వరకు జరగనుండగా.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17నుంచి ఏప్రిల్ 10వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే.