TG ICET 2026 | తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్లలో ప్రవేశాల కోసం ఐసెట్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది.
By Education News Team
Updated :06 Feb 2026 17:44 IST
https://results.eenadu.net/education-news/Telangana-ICET-2026-Notification-Released
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐసెట్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 16వరకు (ఆలస్య రుసుం లేకుండా) ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 13, 14 తేదీల్లో ఈ పరీక్ష జరగనుంది. మే 13న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్, మే 14న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మూడో సెషన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
దరఖాస్తు రుసుంను జనరల్ అభ్యర్థులకు రూ.750గా నిర్ణయించారు. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులైతే రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. మే 29న ప్రిలిమినరీ కీ విడుదల చేసి.. మే 30 నుంచి జూన్ 5వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. తుది కీ, ఫలితాలను జూన్ 19న విడుదల చేయనున్నట్లు అధికారులు షెడ్యూల్లో పేర్కొన్నారు. అభ్యర్థులు ప్రాక్టీస్ చేసుకొనేందుకు వీలుగా మాక్ టెస్టులతో పాటు 2022 నుంచి 2025 వరకు ఈ పరీక్షకు సంబంధించిన పాత టెస్ట్ పేపర్లను అందుబాటులోఉంచారు.