Sundar pichai I కొత్త ఆలోచనల కోసం.. ‘కాంప్లిమెంటరీ మీల్స్‌ ’: సుందర్‌ పిచాయ్‌

Sundar pichai I కొత్త ఆలోచనల కోసం.. ‘కాంప్లిమెంటరీ మీల్స్‌ ’: సుందర్‌ పిచాయ్‌

ప్రపంచంలోనే ప్రఖ్యాత సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ తన ఉద్యోగులకు ఎంతో ఖర్చు పెట్టి ఉచిత భోజన వసతి (google free meals) కల్పించడం వెనుక అసలు కారణాన్ని ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ (sundar pichai) వెల్లడించారు.

Published :22 Oct 2024 20:46 IST

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే ప్రఖ్యాత సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ (Google) తన ఉద్యోగులకు ఎంతో ఖర్చు పెట్టి ఉచిత భోజన వసతి (google free meals) కల్పించడం వెనుక అసలు కారణాన్ని ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ (sundar pichai) వెల్లడించారు.  ఉచిత భోజనం అందించడం లోతైన ప్రయోజనం దాగి ఉందన్నారు.  ‘ది డేవిడ్ రూబెన్‌స్టెయిన్ షో’లో ఇటీవల పాల్గొన్న సుందర్‌ పిచాయ్‌.. కాంప్లిమెంటరీ మీల్స్‌ అందించాలన్న తమ కంపెనీ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని షేర్‌ చేసుకున్నారు. ఉద్యోగుల్లో పరస్పర సహకారాన్ని ప్రోత్సహించేందుకు, సృజనాత్మకతను ప్రేరేపించేందుకు ఇదో వ్యూహాత్మక చర్యగా పేర్కొన్నారు. 

పుస్తకం పట్టుకోగానే నిద్ర ముంచుకొస్తోందా? 10 చిట్కాలు ఇవిగో!

ఈ సందర్భంగా తన సొంత అనుభవాలను వివరించారు. అందరూ (google employees) భోజనం చేసేటప్పుడు మాట్లాడుకొనే సమయంలో అనేక వినూత్న ఆలోచనలు ఉద్భవించాయన్నారు.  2004లో తాను గూగుల్‌లో ప్రొడక్ట్‌ మేనేజర్‌గా చేరినప్పటి నుంచి ఈ డైనింగ్‌ ఇంటరాక్షన్‌లు క్రియేటివిటీని ఎలా పెంచాయో స్వయంగా చూశానన్నారు.  పలుమార్లు.. తాను కెఫేలో ఎవరినైనా కలిస్తే.. తమ చర్చలు ఉత్తేజకరమైన కొత్త ఆలోచనలకు దారితీస్తాయని చెప్పారు. అనుకోకుండా జరిగే సంభాషణల నుంచి కొత్త ఆలోచనలు ఎలా ఉద్భవించేవో గుర్తు చేసుకున్నారు. 

జేఈఈ మెయిన్‌, నీట్‌కు ప్రిపేర్‌ అవుతున్నారా? ఇదిగో సువర్ణావకాశం!

గూగుల్‌ చేపట్టిన ఉచిత భోజన కార్యక్రమం పరస్పర సహకార సంస్కృతిని నిర్మించడంలో  తోడ్పడిందన్నారు. ఈ చర్య వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులందరినీ ఒకచోటకు చేర్చి.. మేథోమథనం, సమస్యల పరిష్కార (ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌) అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు. తద్వారా చేకూరే దీర్ఘకాలిక ప్రయోజనాలు భోజనం అందించే ఖర్చు కన్నా చాలా ఎక్కువన్నారు. దీన్ని కేవలం ఉద్యోగి ప్రయోజనం కంటే ఆవిష్కరణకు పెట్టుబడిగా చూస్తారన్నారు. ఉచిత భోజన వసతి ఒక్కటే కాదు.. ఉద్యోగుల అనుకూల విధానాలను పాటించే కంపెనీగా గూగుల్‌ ప్రసిద్ధిగాంచింది. అందువల్లే గూగుల్‌ సంస్థలో ఉద్యోగం వస్తే చాలు ఈ జీవితానికి అనుకొనేలా యువతలో క్రేజ్‌కు దారితీసింది. గూగుల్‌లో 1.82లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా.. వీరందరికీ మంచి వేతనంతో పాటు  ఫ్లెక్సిబుల్‌ రిమోట్‌ వర్క్‌ ఆప్షన్లు, హెల్త్ ఇన్సూరెన్స్‌, వెల్‌నెస్‌ ప్రోగ్రామ్‌లు.. ఇలా అనేక ప్రయోజనాలు అందిస్తోంది.