Work Skills I వృత్తిలో రాణించాలంటే.. ఈ 12 నైపుణ్యాలూ అవసరమే!

Work Skills I వృత్తిలో రాణించాలంటే.. ఈ 12 నైపుణ్యాలూ అవసరమే!

ఏ వృత్తిలోనైనా రాణించాలంటే సంబంధిత నైపుణ్యాలతో పాటు ఈ కింద పేర్కొన్న 12 స్కిల్స్‌ కూడా ఎంతో అవసరమంటున్నారు మోతీలాల్‌ ఓస్వాల్‌. మరి ఆయన చెబుతోన్న ఈ నైపుణ్యాలు మీలో ఉన్నాయా? చెక్‌ చేసుకోండి.

Published :22 July 2024 16:10 IST

ఈ పోటీ ప్రపంచంలో ఏదైనా వృత్తిలో రాణించాలంటే సంబంధిత నైపుణ్యాలు మాత్రమే ఉంటే సరిపోదు. అంతకుమించిన స్కిల్స్‌ (Skills) కూడా చాలా అవసరం. కొత్త సవాళ్లను స్వీకరించడం, బృందాన్ని బాధ్యతతో నడిపించడం, ఎప్పటికప్పుడు ఎదురయ్యే సమస్యల్ని సమయస్ఫూర్తితో పరిష్కరించే చాకచక్యం కలిగిన వారిని ఏ కంపెనీలూ అంత తేలిగ్గా వదులుకోవు. అందువల్ల, కెరీర్‌లో రాణించేందుకు ఈ 12 నైపుణ్యాలూ అవసరమంటున్నారు మోతీలాల్‌ ఓస్వాల్‌ సంస్థ సహ- వ్యవస్థాపకులు మోతీలాల్‌. మరి ఆయన చెబుతోన్న ఈ స్కిల్స్‌ మీలో ఉన్నాయా? చెక్‌ చేసుకోండి. 

నిద్రలోనూ ఆలోచనలేనా?ఈ ‘బటర్‌ఫ్లై ట్యాపింగ్‌’ టెక్నిక్‌ ట్రై చేయండి!

  1. మీరు చేయలేని లేదా చేయాల్సిన అవసరం లేని పనికి నిర్మొహమాటంగా ‘నో’ చెప్పగలగడం తెలియాలి. 

  2. అవసరమైనప్పుడు సహాయం అడగడం తెలియాలి.

  3. పనిలో చురుగ్గా ఉంటూనే అడ్డంకులను అధిగమించగలగడం

  4.  క్రమశిక్షణతో మెలగడం

  5. బృంద సభ్యుల పట్ల సహానుభూతితో వ్యవహరించడం 

  6. తప్పులకు బాధ్యత వహించడం 

  7. కొత్త సవాళ్లకు సంసిద్ధులై ఉండటం 

  8. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం 

  9. సరైన ప్రశ్నలు అడగడం ద్వారా అవసరమైన సమాచారాన్ని రాబట్టడం 

  10. నలుగురి ఎదుట ధైర్యంగా మాట్లాడగలగడం 

  11. నిర్మాణాత్మకంగా విమర్శించగలగడం 

  12. మీ సమయాన్ని సమర్థంగా వినియోగించుకోవడం