CBSE 10, 12 Exams Date sheets 2025| సీబీఎస్‌ఈ 10, 12 తరగతి పరీక్షల డేట్‌ షీట్స్‌ ఇవిగో!

CBSE 10, 12 Exams Date sheets 2025| సీబీఎస్‌ఈ 10, 12 తరగతి పరీక్షల డేట్‌ షీట్స్‌ ఇవిగో!

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న సీబీఎస్‌ఈ(CBSE) 10, 12 తరగతుల పరీక్షల టైం టేబుల్‌ వచ్చేసింది.

Published :21 Sep 2024 15:10 IST

CBSE 10, 12 Exams Date sheet 2025|  ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న సీబీఎస్‌ఈ (CBSE) 10, 12 తరగతుల పరీక్షల టైం టేబుల్‌ వచ్చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్‌ఈ పది, పన్నెండో తరగతుల పరీక్షలు ప్రారంభమవుతాయని బోర్డు వెల్లడించింది. పదో తరగతి పరీక్షలు మార్చి 18 వరకు; 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 4 వరకు కొనసాగుతాయని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30గంటలకు మొదలవుతాయని పేర్కొంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా పరీక్షల డేట్‌షీట్లను తొలిసారి 86 రోజుల ముందుగా విడుదల చేయడం గమనార్హం. 

పరీక్షల్లో ఉత్తమ స్కోరు.. ఈ స్మార్ట్‌ టిప్స్‌ పాటిస్తున్నారా?

పదో తరగతి పరీక్షల డేట్‌షీట్లు ఇవే.. 

దాదాపు మూడు నెలల ముందుగానే CBSE Exams daatesheets ఇవ్వడం వల్ల విద్యార్థులు ఎగ్జామ్స్‌ పట్ల ఆందోళనను అధిగమించడంతో పాటు పరీక్షల్లో మంచి పనితీరును కనబరిచేందుకు దోహదపడుతుందని బోర్డు పేర్కొంది. ‘‘అంతేకాకుండా, ముందుగానే ప్రిపరేషన్‌ను మొదలు పెట్టగలుగుతారు. ఈ డేట్‌షీట్లను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు రాబోయే వేసవి సెలవులను ప్లాన్‌ చేసుకోవచ్చు. పరీక్ష కేంద్రంగా నిర్ణయించే పాఠశాలలు తమ కార్యకలాపాలను ప్లాన్‌ చేసుకొనేందుకు తగినంత సమయం ఉంటుంది’’ అని తెలిపింది.

12వ తరగతి పరీక్షల డేట్‌షీట్లు ఇవే..