AP Mega DSC Mock tests | ఏపీ డీఎస్సీ మాక్ టెస్ట్‌లు ఇవిగో.. మీరూ ట్రై చేస్తారా?

AP Mega DSC Mock tests | ఏపీ డీఎస్సీ మాక్ టెస్ట్‌లు ఇవిగో.. మీరూ ట్రై చేస్తారా?

ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే మెగా డీఎస్సీ(AP Mega DSC 2025)కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.

Eenadu icon
By Education News Team Published :21 May 2025 15:44 IST

AP DSC mock tests 2025| ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే మెగా డీఎస్సీ(AP Mega DSC 2025)కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. జూన్‌ 6 నుంచి జులై 6 వరకు జరగనున్న ఈ పరీక్షకు సంబంధించి విద్యాశాఖ నమూనా పరీక్ష(Mock Test)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 17 పేపర్లకు సంబంధించిన మాక్‌ టెస్టులను అందుబాటులో ఉంచింది. 

ఈ మాక్‌ టెస్టు అభ్యర్థుల ప్రిపరేషన్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. దీని ద్వారా పరీక్ష మోడల్‌ తెలియడంతో పాటు సమయ పాలన, అభ్యర్థులు తమ బలాలు, బలహీనతల్ని అంచనా వేసుకొని తమను తాము మరింతలా మెరుగుపరుచుకొనేందుకు ఇదో గొప్ప అవకాశంగా ఉపయోగపడనుంది. ఈ మాక్‌ టెస్ట్‌ను ఏపీ డీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.  రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో 16,347 ఉద్యోగాల భర్తీ కోసం ఏప్రిల్‌ 20 నుంచి మే 15వరకు దరఖాస్తులు ఆహ్వానించగా.. అన్ని పోస్టుకు దాదాపు మూడున్నర లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. 

పోస్టుల వారీగా మాక్‌టెస్టులు ఇవిగో..


1. ఎస్‌జీటీ, 2. పీజీటీ ప్రిన్సిపల్‌, 3. టీజీటీ సోషల్‌, 4. టీజీటీ ఫిజికల్‌ సైన్స్‌, 5. టీజీటీ మ్యాథ్స్‌, 6. టీజీటీ బయోలాజికల్‌ సైన్స్‌, 7. పీజీటీ బయోలాజికల్‌ సైన్స్‌, 8. పీజీటీ బోటనీ, 9. పీజీటీ కామర్స్‌, 10. పీజీటీ ఎకనామిక్స్‌, 11. పీజీటీ ఇంగ్లిష్‌, 12. పీజీటీ మ్యాథ్స్‌, 13. పీజీటీ ఫిజికల్‌ సైన్స్‌, 14. పీజీటీ సోషల్‌, 15. పీజీటీ తెలుగు, 16. పీజీటీ జువాలజీ, 17. టీజీటీ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌

మాక్‌ టెస్టులు పొందండి ఇలా..

  • తొలుత ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • హోమ్‌ పేజీలో Mock Test linksపై క్లిక్‌ చేస్తే ఒక విండో ఓపెన్‌ అవుతుంది.
  • సైన్‌ ఇన్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్‌ వస్తాయి. వాటిని క్షుణ్ణంగా చదివిన తర్వాత మీ ప్రాక్టీసును మొదలుపెట్టండి.