Postal GDS Results | ‘తపాలా’లో 21,413 ఉద్యోగాలు.. తొలి షార్ట్‌లిస్ట్‌ వచ్చేసింది

Postal GDS Results | ‘తపాలా’లో 21,413 ఉద్యోగాలు.. తొలి షార్ట్‌లిస్ట్‌ వచ్చేసింది

Postal GDS Results| పోస్టల్‌ జీడీఎస్‌ ఉద్యోగాలకు షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది.

Eenadu icon
By Education News Team Published :21 Mar 2025 20:16 IST

Postal GDS Results| ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్(Postal) సర్కిళ్లలోని బ్రాంచ్‌ పోస్ట్ ఆఫీసుల్లో 21,413  గ్రామీణ డాక్ సేవక్(GDS) పోస్టులకు దరఖాస్తు చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అధికారులు.. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. పదో తరగతి అర్హతతో ఎంపిక చేసే ఈ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 1215,  తెలంగాణలో 519  చొప్పున పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల కోసం ఫిబ్రవరి 10 నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారి తొలి జాబితాలో ఏపీ నుంచి 1201 మంది; తెలంగాణ నుంచి 516 మంది షార్ట్‌ లిస్ట్‌ అయ్యారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://indiapostgdsonline.gov.in/లో అందుబాటులో ఉంచారు.

ఏపీ జీడీఎస్‌ తొలి జాబితా కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణ జీడీఎస్‌ తొలి జాబితా కోసం క్లిక్‌ చేయండి

కంప్యూటర్ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి చేపట్టిన ఈ ప్రక్రియలో షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులు ఏప్రిల్‌ 7 లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది.