Postal GDS Results | పోస్టల్‌లో 44వేల పోస్టులు.. షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల మూడో జాబితా విడుదల

Postal GDS Results | పోస్టల్‌లో 44వేల పోస్టులు.. షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల మూడో జాబితా విడుదల

Postal Jobs: పోస్టల్‌ శాఖలో 44వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ కింద ఇచ్చిన లింక్‌లపై క్లిక్‌ చేయడం ద్వారా పొందొచ్చు.

Published :20 Oct 2024 20:12 IST

Postal Jobs | ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 44,228 గ్రామీణ డాక్ సేవక్(GDS)ఉద్యోగాల భర్తీకి తపాలాశాఖ జులైలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన వారి  మూడో జాబితాను తపాలా శాఖ అధికారులు విడుదల చేశారు.  ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన అధికారులు.. తాజాగా మూడో జాబితాలో ఏపీ నుంచి 365మందిని, తెలంగాణ నుంచి 283మందిని ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులు నవంబర్‌ 4వ తేదీలోపు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. మూడో జాబితాను https://indiapostgdsonline.gov.in/లో అందుబాటులో ఉంచారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాలకు సంబంధించిన జాబితాలను హోల్డ్‌లో ఉంచారు. 

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ మూడో జాబితా కోసం క్లిక్ చేయండి 

తెలంగాణ జీడీఎస్ మూడో జాబితా కోసం క్లిక్ చేయండి 

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1355 పోస్టులు ఉండగా, తెలంగాణలో 981 ఉన్నాయి.  ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందిస్తారు. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు.