TGPSC | సంక్షేమ శాఖల్లో ఉద్యోగ నియామక పరీక్ష తుది కీ, జనరల్ ర్యాంకింగ్స్ విడుదల
తెలంగాణలో పలు సంక్షేమశాఖల పరిధిలోని హాస్టళ్లలో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్ష తుది కీ, జనరల్ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి.
Published :20 Sep 2024 20:21 IST
https://results.eenadu.net/news.aspx?newsid=200924
హైదరాబాద్: తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా శిశు సంక్షేమశాఖల పరిధిలోని హాస్టళ్లలో పలు ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్ష తుది కీ, జనరల్ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. గ్రేడ్-1, గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, మ్యాట్రన్, వార్డెన్, మహిళా సూపరింటెండెంట్ ఉద్యోగ నియామక పరీక్షకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్స్‌ను టీజీపీఎస్సీ (TGPSC) శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని వసతి గృహాల్లో 562 అధికారులు, పిల్లల సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్ పోస్టులకు 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పరీక్షలను జూన్ 24 నుంచి 29వరకు టీజీపీఎస్సీ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించింది. జులై 18న ప్రిలిమినరీ కీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు తాజాగా తుది కీ, జనరల్ ర్యాంకింగ్స్ జాబితాలను విడుదల చేశారు.
తుది కీ కోసం క్లిక్ చేయండి
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ I, II, లేడీ సూపరింటెండెంట్ జనరల్ ర్యాంకింగ్స్
వార్డెన్, మ్యాట్రన్ గ్రేడ్ I, II జనరల్ ర్యాంకింగ్స్