Postal GDS Results| పోస్టల్‌లో 44,228 పోస్టులు.. షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల జాబితా వచ్చేసింది

Postal GDS Results| పోస్టల్‌లో 44,228 పోస్టులు.. షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల జాబితా వచ్చేసింది

తపాలా శాఖలో 44వేలకు పైగా ఉద్యోగాలకు సంబంధించి షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల జాబితా విడుదలైంది.

Published :19 August 21:00 IST

Postal GDS Results| ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్(Postal) సర్కిళ్లలోని బ్రాంచ్‌ పోస్ట్ ఆఫీసుల్లో 44,228  గ్రామీణ డాక్ సేవక్(GDS) పోస్టులకు దరఖాస్తు చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అధికారులు.. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేశారు. పదో తరగతి అర్హతపై ఎంపిక చేసే ఈ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 1,355 పోస్టులు ఉండగా, తెలంగాణలో 981 చొప్పున పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల కోసం జులై 15 నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. తాజాగా విడుదల చేసిన తొలి జాబితాలో ఏపీ నుంచి 1355 మంది; తెలంగాణ నుంచి 981 మంది షార్ట్‌ లిస్ట్‌ అయ్యారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://indiapostgdsonline.gov.in/లో అందుబాటులో ఉంచారు.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ తొలి జాబితా కోసం క్లిక్ చేయండి 

తెలంగాణ జీడీఎస్ తొలి జాబితా  కోసం క్లిక్ చేయండి

కంప్యూటర్ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి చేపట్టిన ఈ ప్రక్రియలో షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 3 లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది. 

ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు కావాల్సినవి ఇవే..

  • దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్‌ అప్లికేషన్‌
  • పుట్టిన తేదీ ధ్రువీకరణ సంబంధించి పదో తరగతి మార్కుల మెమో 
  • 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు 
  • అభ్యర్థి పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు 
  •  ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ , కుల ధ్రువీకరణ పత్రం 
  • ఆధార్‌ కార్డు , ఆదాయ ధ్రువీకరణపత్రం
  • దివ్యాంగులైతే దివ్యాంగ ధ్రువీకరణ పత్రం
  • మెడికల్‌ సర్టిఫికెట్‌