TG Inter Supplementary Exams hall tickets released టీజీ ఇంటర్‌ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ ఇలా..

TG Inter Hall tickets: టీజీ ఇంటర్‌ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ ఇలా..

తెలంగాణలో మే 24 నుంచి జరగనున్న ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.

Published : 18 May 2024 17:40 IST

హైదరాబాద్‌: తెలంగాణలో మే 24 నుంచి జూన్‌ 3వరకు జరగనున్న ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా సూచించారు.ఈ కింది ఇచ్చిన లింక్‌లపై క్లిక్‌ చేసి గత హాల్‌టికెట్‌ నంబర్‌/SSC హాల్‌టికెట్ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి విద్యార్థులు నేరుగా తమ పరీక్ష హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

ప్రథమ ఇంటర్‌ హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి

ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో ప్రథమ సంవత్సరం జనరల్‌లో 4,30,413 మందికి గాను 2,62,829 మంది ఉత్తీర్ణులు కాగా.. 1,67,584 మంది తప్పారు. సప్లిమెంటరీలకు జనరల్‌ విద్యార్థులు 2,54,100 మంది పరీక్ష రుసుం చెల్లించారు. అంటే 86,516 మంది మార్కులు పెంచుకునేందుకు పరీక్షలు రాస్తున్నారు. ఒకేషనల్‌నూ కలుపుకొంటే మొత్తంగా 2,72,996 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ద్వితీయ ఇంటర్‌ హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి

బ్రిడ్జి కోర్సు హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి