EAPCET Rank card : టీజీ ఈఏపీసెట్ ర్యాంక్ కార్డుల కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి అధికారులు.. ర్యాంక్ కార్డుల్ని అందుబాటులోకి తెచ్చారు.
Published : 18 May 2024 14:40 IST
https://results.eenadu.net/news.aspx?newsid=18052024
హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ (TG EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. దాదాపు మూడున్నర లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయగా.. అగ్రికల్చర్, ఫార్మసీలో 89 శాతం.. ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత నమోదైన విషయం తెలిసిందే. అయితే, ఫలితాలతో పాటు విద్యార్థులు సాధించిన ర్యాంక్ కార్డులను సైతం డౌన్‌లోడ్ చేసుకొనేందుకు వీలుగా ఉన్నత విద్యామండలి అధికారులు అందుబాటులో ఉంచారు. EAPCET Rank card పొందేందుకు విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, ఈఏపీసెట్ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి