Postal GDS Results: పోస్టల్‌లో 44,228 పోస్టులు.. షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల రెండో జాబితా ఇదే..

Postal GDS Results: పోస్టల్‌లో 44,228 పోస్టులు.. షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల రెండో జాబితా ఇదే..

Postal Jobs: పోస్టల్‌ శాఖలో 44వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెరిట్‌ ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ కింద ఇచ్చిన లింక్‌లపై క్లిక్‌ చేయడం ద్వారా పొందొచ్చు.

Published :17 September 2024 19:00 IST

Postal Jobs | ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 44,228 గ్రామీణ డాక్ సేవక్(GDS)ఉద్యోగాల భర్తీకి తపాలాశాఖ జులైలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల రెండో జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది. గత నెలలో తొలి జాబితా విడుదల చేయగా.. తాజాగా రెండో జాబితాను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితాను https://indiapostgdsonline.gov.in/లో అందుబాటులో ఉంచారు.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ రెండో జాబితా కోసం క్లిక్ చేయండి 

తెలంగాణ జీడీఎస్ రెండో జాబితా కోసం క్లిక్ చేయండి 

రైల్వే జాబ్స్‌.. డిగ్రీతో 8,113 ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1355 పోస్టులు ఉండగా, తెలంగాణలో 981 ఉన్నాయి. రెండో జాబితాలో ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్‌ 3లోగా  ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందిస్తారు. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు.