RRB NTPC Recruitment 2024 | రైల్వే జాబ్స్‌.. డిగ్రీతో 8,113 ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..

RRB NTPC Recruitment 2024 | రైల్వే జాబ్స్‌.. డిగ్రీతో 8,113 ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..

రైల్వేశాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తికలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి.

Published :16 Sep 2024 15:04 IST

RRB NTPC Recruitment 2024| ఇంటర్నెట్‌ డెస్క్‌: రైల్వేలో ఉద్యోగం చేయాలనుకొనేవారికి సువర్ణావకాశం. దేశంలోని పలు రైల్వే జోన్‌లలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (గ్రాడ్యుయేట్‌) పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్‌ 13 రాత్రి 11.59గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. మొత్తం 8,113 పోస్టులను భర్తీ చేస్తుండగా.. వీటిలో చీఫ్‌ కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ సూపర్‌వైజర్‌ (1736 పోస్టులు), స్టేషన్‌ మాస్టర్‌(994), గూడ్స్‌ ట్రైన్‌ మేనేజర్‌ (3144), జూనియర్‌ అకౌంట్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ (1507), సీనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ (732) చొప్పున ఉన్నాయి. ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్‌ పరిధిలో 478 పోస్టులు ఉండగా, ఆర్‌ఆర్‌బీ బెంగళూరు (496), ఆర్‌ఆర్‌బీ చెన్నై (436), ఆర్‌ఆర్‌బీ భువనేశ్వర్‌ (758) చొప్పున భర్తీ చేయనున్నారు. 

పదితో 39వేల ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి

  • విద్యార్హత అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత తప్పనిసరి.
  • వయో పరిమితి: 2025 జనవరి 1 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
  • వయో సడలింపు: ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు చొప్పున సడలింపు కల్పించారు.  
  • ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (టైర్-1, టైర్-2), టైపింగ్ స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
  • ప్రారంభ వేతనం ఇలా..: చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్/ స్టేషన్ మాస్టర్ పోస్టులకు రూ.35,400; ఇతర ఉద్యోగాలకు రూ.29,200 చొప్పున ఇస్తారు. పూర్తి సమాచారంతో కూడిన బుక్‌లెట్‌ కోసం క్లిక్‌ చేయండి