TG Inter Exams | తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పు.. కొత్త టైం టేబుల్ ఇదే..
తెలంగాణలో ఇంటర్ పరీక్షల(TG Inter Exams 2026) షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది.
By Education News Team
Updated :16 Dec 2025 18:37 IST
https://results.eenadu.net/news.aspx?newsid=16122025tg-inter
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో ఇంటర్ పరీక్షల(TG Inter Exams 2026) షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. మార్చి 3న జరగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్-2ఎ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలను 4వ తేదీన నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. మార్చి 3న హోలీ పండుగ సెలవు నేపథ్యంలో ఈ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు తెలిపారు. మిగతా పరీక్షలన్నీ యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు. మార్పు చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఇంటర్ పరీక్షల కొత్త టైం టేబుల్ ఇదీ.. (Inter Exams time table)

గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ రాత పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21 వరకు.. రోజూ రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. ఉదయం 9-12, మధ్యాహ్నం 2-5 గంటల వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఆంగ్లంలో ప్రాక్టికల్స్(20 మార్కులకు).. ఫస్టియర్ విద్యార్థులకు జనవరి 21న, సెకండియర్‌కు 22న జరుగుతాయి. ప్రథమ ఏడాది విద్యార్థులకు జనవరి 24వ తేదీన పర్యావరణ విద్య పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ ఒకేషనల్ కోర్సుల పరీక్షలకూ ఇవే తేదీలు వర్తిస్తాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. అయితే, దీనికి వేరేగా టైం టేబుల్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ కలిపి దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్న విషయం తెలిసిందే.