CSIR-UGC NET Results | జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదల

CSIR-UGC NET Results | జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదల

జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా అభ్యర్థులు తమ ర్యాంకులు తెలుసుకోవచ్చు.

Published :15 Oct 2024 15:07 IST

CSIR UGC NET 2024| ఇంటర్నెట్‌ డెస్క్‌: సైన్స్‌ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించే.. ‘జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌) జూన్‌-2024’ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) మంగళవారం విడుదల చేసింది.  జులై 25, 26, 27 తేదీల్లో దేశవ్యాప్తంగా 187 నగరాల్లో ఈ పరీక్షలను సీబీటీ పద్ధతిలో నిర్వహించగా..  2.25లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. 

టాప్‌-500 కంపెనీల్లో శిక్షణ.. పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తులు షురూ

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ పరీక్షలో అర్హత సాధిస్తే.. సైన్స్‌ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తోపాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హత, పీహెచ్‌డీ ప్రవేశాలకు వీలుకలుగుతుంది.  సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని రిసెర్చ్‌ సెంటర్లలో, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందితే విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గానూ ఎంపికకావచ్చు.