Postal Jobs Notification I పరీక్ష లేదు.. పది పాసైతే చాలు.. తపాలా శాఖలో 44,228 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్
తపాలా శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పది పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు.
Published :15 July 2024 15:00 IST
https://results.eenadu.net/news.aspx?newsid=15072024
దిల్లీ: తపాలా శాఖ(Indian Post)లో కొలువుల జాతర మొదలైంది. ఈ ఏడాది 44 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి భారీ సోమవారం భారీ నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 44,228 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) పోస్టుల భర్తీకి జులై 15 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి పాసైన అభ్యర్థులు ఆగస్టు 5వరకు ఆన్‌లైన్‌లో https://indiapostgdsonline.gov.in/ దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆగస్టు 6 నుంచి 8వరకు దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం కల్పించారు.
పరీక్ష లేదు.. వేతనం ఎంతంటే?
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)/ డాక్‌సేవక్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్టు తపాలా శాఖ అధికారులు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అలాగే,అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం రావాలి. ఆ ఉద్యోగాలను బట్టి బీపీఎంకు వేతన శ్రేణి రూ.12 వేలు -రూ.29,380; ఏబీపీఎం/డాక్ సేవక్‌కు రూ.10వేలు -24,470గా నిర్ణయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు చొప్పున గరిష్ఠ వయసులో సడలింపు ఉంది.
సర్కిళ్ల వారీగా పోస్టుల జాబితా కోసం క్లిక్ చేయండి
తెలుగు రాష్ట్రాల్లో భర్తీచేసే ఉద్యోగాలెన్నంటే..?
మొత్తం 44,228 పోస్టులు కాగా.. ఏపీలో 1355, తెలంగాణలో 981 చొప్పున భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు రోజుకు నాలుగు గంటల పాటు పనిచేస్తే సరిపోతుంది. అలాగే, వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు(IPPB)కు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహకాలు ఇస్తారు. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి.
రాష్ట్రాలు/జిల్లాల వారీగా పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి