CBSE Class 10, 12 Results I సీబీఎస్‌ఈ 10, 12 తరగతి ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సీబీఎస్‌ఈ పది, 12వ తరగతి పరీక్షల ఫలితాలు(CBSE Class 10th Results) వచ్చేశాయి.
By Education News Team
Updated :13 May 2025 14:45 IST
https://results.eenadu.net/news.aspx?newsid=13052025-cbse-class-10th-results
CBSE Class 10, 12 Results | ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సీబీఎస్‌ఈ 10, 12 తరగతి ఫలితాలు(CBSE Class 10, 12 Results) విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం 12వ తరగతి ఫలితాలను విడుదల చేసిన సీబీఎస్‌ఈ బోర్డు(CBSE) .. మధ్యాహ్నం పదో తరగతి ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు సీబీఎస్‌ఈ పది, 12వ తరగతి పరీక్షలు జరగ్గా.. దాదాపు 42లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలు తెలుసుకొనేందుకు రోల్ నంబర్, అడ్మిట్ కార్డు ఐడీ, స్కూల్ కోడ్, పుట్టిన తేదీ వంటి వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18వరకు జరిగిన సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల్లో 93.66శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 0.06శాతం ఉత్తీర్ణత అధికంగా నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 23,71,939మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 1.99లక్షల మందికి పైగా విద్యార్థులు 90శాతానికి పైగా స్కోరు సాధించారు. 45వేల మందికి పైగా విద్యార్థులు 95శాతం స్కోరు సాధించారు. పదో తరగతి ఫలితాల్లో 99.79శాతం ఉత్తీర్ణతతో త్రివేండ్రం రీజియన్ అగ్రస్థానంలో నిలవగా.. ఆ తర్వాత విజయవాడ, బెంగళూరు, చెన్నై, పుణెలు నిలిచాయి.
సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి
సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో విజయవాడ టాప్
సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో విజయవాడ 99.60శాతం ఉత్తీర్ణతతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో త్రివేండ్రం (99.32%), చెన్నై (97.39%), బెంగళూరు (95.95%), దిల్లీ పశ్చిమ (95.37%) ఉన్నాయి. ఈ ఏడాది మొత్తంగా 16,92,794 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 14,96,307 మంది (88.39శాతం) ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే 0.41శాతం ఉత్తీర్ణత పెరిగింది.