AI skills: ఏలబోయేవి AI నైపుణ్యాలే.. టాప్-15 స్కిల్స్ ఇవే..!
జాబ్ మార్కెట్‌కు అవసరమైన స్కిల్స్ నేర్చుకుంటే కెరీర్‌లో తిరుగుండదు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ రంగంలో ఏఐ టెక్నాలజీకి ప్రాముఖ్యత పెరుగుతుండటంతో ఈ కింద పేర్కొన్న AI సంబంధిత కోర్సులు/నైపుణ్యాలు నేర్చుకుంటే కొలువుల్లో రాణించవచ్చు.
Published :12 August 2024 07:13 IST
https://results.eenadu.net/news.aspx?newsid=12082024
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ టెక్నాలజీ (Artificial Intelligence)ప్రవేశంతో డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించాలంటే ఈ AI నైపుణ్యాలే అంత్యంత కీలకంగా మారింది. జాబ్ మార్కెట్‌లో డిమాండ్‌కనుగుణంగా ఎప్పటికప్పుడు స్కిల్స్‌ను మెరుగుపరుచుకొనేవారికి కెరీర్‌లో రాణించగలరు. రాబోయే రోజుల్లో ఏయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు జాబ్ మార్కెట్‌ను ఏలబోతున్నాయో తెలుసా? ఇదే అంశంపై ప్రముఖ జాబ్‌సెర్చ్ పోర్టల్ ఇండీడ్ చేసిన పరిశీలనలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
ఏఐ టెక్నాలజీ విస్తరిస్తుండటంతో టెక్ సంస్థలు ఉద్యోగార్థుల నుంచి ఈ స్కిల్స్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందువల్ల వీటిని నేర్చుకోవడం ద్వారా సాఫ్ట్‌వేర్ రంగంలోకి సులభంగా ప్రవేశించే ఛాన్స్ లభిస్తుంది. రాబోయే కాలంలో బాగా డిమాండ్ ఉండబోయే ఏఐ టెక్నాలజీలు ఏమిటో కూడా ఇండీడ్ వెల్లడించింది. రాబోయే 1 నుంచి 5 సంవత్సరాల్లో ఈ టెక్నాలజీల్లో రాణించిన వారికి ఉద్యోగాలకు ఢోకా ఉండదని అది అభిప్రాయపడింది. ఇందులో ప్రముఖంగా 42 శాతం జనరేటివ్ ఏఐలో లభించబోయే ఉద్యోగాలు.. మొత్తం మెషిన్ లెర్నింగ్‌కు సంబంధించినవే అయ్యుంటాయని అంచనా వేసింది.
ఏఐ కొలువులకు అవసరమైన టాప్ 15 స్కిల్స్ ఇవే..
ఇండీడ్ నివేదిక ప్రకారం.. ప్రస్తుత జాబ్ మార్కెట్‌కు అవసరమైన ఏఐ నైపుణ్యాలు/కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. మెషిన్ లెర్నింగ్ (42శాతం), పైతాన్ (40శాతం), ఏఐ (36శాతం), కమ్యూనికేషన్ స్కిల్స్ (23శాతం), నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (20శాతం), టెన్సర్ ఫ్లో (19శాతం), డేటా సైన్స్ (17శాతం), ఏడబ్ల్యూఎస్ (14శాతం), డీప్ లెర్నింగ్ (14శాతం), జావా (11శాతం), ఎజ్యూర్ (11శాతం), ఇమేజ్ ప్రాసెసింగ్ (10శాతం), ఎస్‌క్యూఎల్ (10శాతం), పైటార్చ్ (9శాతం), అజేల్ (8శాతం) చొప్పున ఉన్నట్లు పేర్కొంది.
వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు 8-8-8 రూల్.. మీరూ ట్రై చేస్తారా?
మరోవైపు, భారత్‌లో 2027 నాటికి ఏఐ మార్కెట్ విలువ 17 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఒక అంచనా. ఏటా దాదాపు 25 నుంచి 35 శాతం వృద్ధితో ముందుకెళ్తోంది. జాబ్ మార్కెట్‌లో ఇంత ప్రాముఖ్యత కలిగిన ఏఐ స్కిల్స్‌ను అందిపుచ్చుకొనేలా దృష్టిసారించాలని ఇండీడ్ సూచించింది. మెషిన్ లెర్నింగ్ మాదిరిగానే.. రిక్రూటర్లు 40శాతం వరకూ పైతాన్ స్కిల్స్ కావాలని కోరుతున్నారు. ఏఐ కోర్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌కు కూడా అధిక డిమాండ్ ఉండటంతో వీటిని నేర్చుకునేవారు ఈ రంగంలో గొప్పగా రాణించేందుకు అవకాశాలున్నాయి.