sebi jobs online application | రూ. లక్షన్నర జీతం.. సెబీలో ఉద్యోగాలకు దరఖాస్తులు షురూ

Jobs in SEBI : ₹లక్షన్నర జీతం.. సెబీలో ఉద్యోగాలకు దరఖాస్తులు షురూ

సెబీలో భారీ వేతనాలతో పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు మొదలయ్యాయి.

Published : 12 June 2024 17:25 IST

Jobs In SEBI| ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ఫైనాన్షియల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI)లో ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. మొత్తం 97 ఆఫీసర్‌ గ్రేడ్‌ ఏ (అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టుల భర్తీకి మార్చిలోనే నోటిఫికేషన్‌ వెలువడగా.. ఏప్రిల్‌ 13నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు కావాల్సింది. అయితే, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయి, ఫలితాలు విడుదల కావడంతో ఈ ఉద్యోగాల భర్తీకి  ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ దరఖాస్తుల ప్రక్రియ ప్రక్రియ జూన్‌ 11 నుంచి 30వరకు కొనసాగనుంది.  

నోటిఫికేషన్‌లో ముఖ్యాంశాలివే..

  • మొత్తం 97 ఆఫీసర్‌ గ్రేడ్‌ ఏ (అసిస్టెంట్‌ మేనేజర్‌) ఉద్యోగాలకు గతంలో సెబీ నోటిఫికేషన్‌ ఇవ్వగా.. తాజాగా దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.  జనరల్‌, లీగల్‌, ఐటీ, ఇంజినీరింగ్‌ ఎలక్ట్రికల్‌, రీసెర్చ్‌ అండ్‌ అఫీషియల్‌ లాంగ్వేజ్‌ కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.  ఈ కొలువులకు https://www.sebi.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకొనే ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ దివ్యాంగులకు ఉచితంగానే శిక్షణ ఇస్తారు.
  • మొత్తం 97 ఉద్యోగాలకు గాను.. జనరల్‌ విభాగంలో 62, ఐటీలో 24, లీగల్‌ విభాగంలో 5, ఇంజినీరింగ్‌ (ఎలక్ట్రికల్‌), రీసెర్చ్‌, అఫీషియల్‌ లాంగ్వేజ్‌ కేటగిరీల్లో చెరో రెండు చొప్పున పోస్టులను భర్తీ చేస్తారు.
  • అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్‌/పీజీ పూర్తి చేసి ఉండాలి. పోస్టుల వారీగా విద్యార్హతలను ఈ లింక్‌పై క్లిక్‌ చేసి తెలుసుకోవచ్చు.
  • దరఖాస్తు రుసుం: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ.1000 + జీఎస్టీ (నాన్‌ రిఫండబుల్‌)  చెల్లించాలి. అదే, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులైతే రూ.100+ జీఎస్టీ చెల్లిస్తే చాలు. 
  • వయో పరిమితి: 2024 మార్చి 31 నాటికి అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించరాదు. ఆయా కేటగిరీల వారీగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
  • ఎంపిక ప్రక్రియ: మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.  తొలి దశలో రెండు పేపర్లకు ఆన్‌లైన్‌ పరీక్ష ఉంటుంది. దీంట్లో అర్హత సాధించిన వారిని రెండో దశ పరీక్ష (ఆన్‌లైన్‌)కు షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు దేశంలోని పలు నగరాల్లో నిర్వహిస్తారు. 
  • ఉద్యోగాలకు ఎంపికైన వారికి రెండేళ్ల పాటు ప్రొబేషన్‌ ఉంటుంది.
  • వేతనం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జీతం, ఇతర సౌకర్యాలతో కలిపి నెలకు దాదాపు రూ.1,49,500 (అకామిడేషన్‌ లేకుండా); అకామిడేషన్‌తో అయితే నెలకు రూ.₹1,11,000 చొప్పున అందుతుంది.
  • ఉచితంగా ఆన్‌లైన్‌ కోచింగ్‌: ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ(ఎన్‌సీఎల్‌/దివ్యాంగులకు సెబీ ప్రీ ఎగ్జామ్‌ ట్రైనింగ్‌ ఏర్పాటుచేస్తుంది. ఉచితంగానే ఆన్‌లైన్‌లో ఈ శిక్షణ ఇస్తారు. ఇందుకోసం అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తుల సమయంలోనే సంబంధిత కాలమ్‌లో ఆప్షన్‌ పెట్టుకోవాల్సి ఉంటుంది.
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే..: ఏపీలో గుంటూరు/విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, విజయనగరం, తిరుపతి, శ్రీకాకుళం, నెల్లూరు,  తెలంగాణలో సికింద్రాబాద్/హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం

ముఖ్యమైన తేదీలివే.. 

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు, ఫీజు చెల్లింపునకు గడువు:  జూన్‌ 30 
  • కాల్‌ లెటర్లు డౌన్‌లోడ్‌: ఈమెయిల్‌/ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం ఇస్తారు.
  • ఎంపిక ప్రక్రియ: ఫేజ్‌ 1 ఆన్‌లైన్‌ పరీక్ష: జులై 27న
  • ఫేజ్‌ II ఆన్‌లైన్‌ పరీక్ష: జులై 31
  • పేపర్‌ 2కు సంబంధించిన ఫేజ్‌ II (ఐటీ స్ట్రీమ్‌) పరీక్ష: సెప్టెంబర్‌ 14
  • ఫేజ్‌ -IIIలో జరిగే ఇంటర్వ్యూ తేదీలను తర్వాత ప్రకటిస్తారు.

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి