CTET 2024 Results| సీటెట్‌ (డిసెంబర్‌) ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

CTET 2024 Results| సీటెట్‌ (డిసెంబర్‌) ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

గత నెలలో సీబీఎస్‌ఈ నిర్వహించిన కేంద్రీయ ఉపాధ్యాయ పరీక్ష (CTET 2024 december) ఫలితాలు వెలువడ్డాయి.

Eenadu icon
By Education News Team Published :09 Jan 2024 19:54 IST

CTET December 2024 result| ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ(CBSE) డిసెంబర్‌ 14, 15 తేదీల్లో నిర్వహించిన కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు (CTET DEC- Results)విడుదలయ్యాయి. ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసి జనవరి 5వరకు అభ్యంతరాలు స్వీకరించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE).. తాజాగా ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ రోల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి ఫలితాలను వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

దేశ వ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో సీటెట్‌ (డిసెంబర్‌) పరీక్షను పేపర్‌ -1, పేపర్‌ -2లను రెండు సెషన్లలో నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు 15లక్షల మందికి పైగా రిజిస్టర్‌ చేసుకున్నారు. సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు జీవిత కాలం వ్యాలిడిటీ ఉంటుంది.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి