AP TET Top Rankers Interview | టెట్‌లో 150/150 మార్కులతో సత్తా.. టాప్‌-3 ర్యాంకర్లతో ఇంటర్వ్యూ!

AP TET Top Rankers Interview | టెట్‌లో 150/150 మార్కులతో సత్తా.. టాప్‌-3 ర్యాంకర్లతో ఇంటర్వ్యూ!

ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024)లో విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురు యువతులు సత్తా చాటారు. వారు సాధించిన అపూర్వ విజయంపై ఇంటర్వ్యూ మీకోసం..

Published :08 Nov 2024 16:22 IST

AP TET Top Rankers Interview| విజయనగరం: ఏపీ టెట్‌ పరీక్షల్లో విజయనగరం జిల్లాకు చెందిన యువతులు సత్తా చాటారు. ఉపాధ్యాయులు కావాలనే పట్టుదల, దృఢ సంకల్పంతో కష్టపడి చదివి.. టెట్‌ పరీక్ష(AP TET)ల్లో టాప్ ర్యాంకులు సాధించారు. కొండ్రు అశ్వినీ 150/150 మార్కులతో భళా అనిపించగా.. ధనలక్ష్మి (149.99/150), హారిక (149.46/150) సాధించి ప్రశంసలు అందుకొంటున్నారు. ఈ ముగ్గురిదీ ఒకే జిల్లా కావడం విశేషం. ఇంతకీ ఈ సరస్వతీ పుత్రికలు టెట్‌కు ఎలా సన్నద్ధమయ్యారు? ఇంత గొప్ప విజయానికి అనుసరించిన ప్రణాళికలేంటి? వారి భవిష్యత్తు లక్ష్యాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం!