Telangana DSC final key | తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ విడుదల.. Key కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీ విడుదలైంది.
Published :06 Sep 2024 17:31 IST
https://results.eenadu.net/news.aspx?newsid=06092024
Telangana DSC Final Key| హైదరాబాద్: తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షల ఫైనల్ కీ (DSC Final Key) విడుదలైంది. ఆగస్టు 13న ప్రిలిమినరీ కీ విడుదల చేయగా.. దానిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ అధికారులు తాజాగా తుది కీ విడుదల చేశారు. Telangana DSC final keyని స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, సెకెండరీ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించి వేర్వేరుగా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. తుది కీ ప్రకారం అభ్యర్థులు ఎవరికి వారు తమకు పరీక్షల్లో వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు. అతి త్వరలోనే ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.
డీఎస్సీ ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 2,45,263 మంది హాజరయ్యారు.