APPSC Group-2 Mains results | ఏపీపీఎస్సీ గ్రూప్2 మెయిన్స్ ఫలితాలు విడుదల..

APPSC Group-2 Mains results | ఏపీపీఎస్సీ గ్రూప్2 మెయిన్స్ ఫలితాలు విడుదల..

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి.

Eenadu icon
By Education News Team Updated :05 Mar 2025 08:45 IST

అమరావతి: ఏపీలో గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్ష ఫలితాలు(APPSC Group2 mains results)వచ్చేశాయి. రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 23న నిర్వహించిన మెయిన్స్ ఫలితాలను శుక్రవారం రాత్రి ఏపీపీఎస్సీ(APPSC) ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 79,451 మంది పరీక్ష రాయగా.. 2,168 అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేశారు. ఏపీపీఎస్సీ కార్యాలయంలో జరిగే ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థులు ఎప్పుడు హాజరు కావాలనే సమాచారాన్ని వ్యక్తిగతంగా తెలియజేయనున్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్ల నంబర్లను మాత్రమే ఏపీపీఎస్సీ ప్రకటించింది. మార్కులు వెల్లడించలేదు. వ్యక్తిగతంగా మార్కులూ వెల్లడించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి

ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి