Telangana TET 2024 Key Released: తెలంగాణ టెట్‌ ప్రిలిమినరీ కీ విడుదల.. రెస్పాన్స్‌ షీట్లు కోసం క్లిక్‌ చేయండి

TG TET Key: తెలంగాణ టెట్‌ ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. రెస్పాన్స్‌ షీట్లు కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రాథమిక కీ, రెస్పాన్స్‌షీట్లు విడుదలయ్యాయి.

Published : 03 June 2024 21:00 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) ప్రిలిమినరీ కీ వచ్చేసింది. మే 20న ప్రారంభమైన Telangana TET పరీక్షలు జూన్‌ 2తో ముగియగా.. మరుసటి రోజే ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్‌ షీట్స్‌ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. పేపర్ల వారీగా కీని అందుబాటులో ఉంచిన అధికారులు.. వీటిపై అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించారు. టెట్‌ పేపర్‌-1కు  99,958 మంది, పేపర్‌-2కు 1,86,423 మంది దరఖాస్తులు చేసుకోగా.. పేపర్‌-1కి 86.03 శాతం మంది, పేపర్‌-2కి 82.58 శాతం మంది హాజరయ్యారు. ఫలితాలు జూన్ 12న విడుదల కానున్నాయి. 

టెట్‌ ప్రాథమిక కీ కోసం క్లిక్‌ చేయండి

రెస్పాన్స్‌షీట్‌ల కోసం క్లిక్‌ చేయండి

కీపై అభ్యంతరాలు తెలిపేందుకు క్లిక్‌ చేయండి