CBSE Admit Card 2025 | సీబీఎస్‌ఈ 10, 12 పరీక్షల అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ ఇలా..!

CBSE Admit Card 2025 | సీబీఎస్‌ఈ 10, 12 పరీక్షల అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ ఇలా..!

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి.

Eenadu icon
By Education News Team Published :03 Feb 2024 15:03 IST

CBSE Admit Cards | దిల్లీ: సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) 10, 12వ తరగతి పరీక్షలకు అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి.  ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షల అడ్మిట్‌ కార్డుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పరీక్షలకు సన్నద్ధమైన విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు(CBSE Exams Admit Cards Download). వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయిన తర్వాత విద్యార్థులు/ఆయా పాఠశాలలు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

దేశ వ్యాప్తంగా దాదాపు 44లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది. రెగ్యులర్‌, ప్రైవేటు విద్యార్థుల ఈ అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రెగ్యులర్‌ విద్యార్థులు తమ పాఠశాలల ద్వారా వీటిని పొందొచ్చు. అడ్మిట్‌ కార్డులపై సంబంధిత పాఠశాల ప్రిన్సిపల్‌ సంతకం తప్పనిసరి. వారి సంతకం లేకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అడ్మిట్‌ కార్డులో రోల్‌ నంబర్‌, పరీక్ష కేంద్రం పేరు, రిపోర్టు చేయాల్సిన సమయంతో పాటు విద్యార్థులకు పలు కీలక సూచనలు ఉంటాయి. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై మార్చి 18తో ముగియనుండగా.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న ఆరంభమై ఏప్రిల్‌ 4 వరకు కొనసాగనున్నాయి.