UPSC CSE 2025 | సివిల్స్ 2025 పరీక్షల్లో కటాఫ్ మార్కులు ఎంతంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ తుది ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.
By Education News Team
Published :09 Mar 2026 20:38 IST
https://results.eenadu.net/education-news/UPSC-CSE-2025-Cut-Off-Marks
ఇంటర్నెట్ డెస్క్: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ తుది ఫలితాలు(UPSC Civils Final result 2025) ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అత్యంత కష్టమైన ఈ పరీక్షల్లో అనూజ్ అగ్నిహోత్రి, రాజేశ్వరి సువే, ఆకాన్ష్ ధుల్ జాతీయ స్థాయిలో తొలి మూడు ర్యాంకులతో (Civils 2025 Toppers) సత్తా చాటగా.. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు అభ్యర్థులు సివిల్స్‌లో మెరిశారు. అయితే, తాజాగా యూపీఎస్సీ అధికారులు సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్, తుది పరీక్షల్లో అభ్యర్థుల అర్హతకు సంబంధించి నిర్ణయించిన కటాఫ్ మార్కుల వివరాలను వెల్లడించారు. కేటగిరీల వారీగా నిర్ణయించిన ఈ కటాఫ్ మార్కులను (UPSC CSE 2025 Cut-Off Marks) పరిశీలిస్తే..
- సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు 92.66గా ఉండగా.. ఈడబ్ల్యూఎస్ 89.34, ఓబీసీ 92, ఎస్సీ 84, ఎస్టీ 82.66, పీడబ్ల్యూబీడీ-I 76.66, పీడబ్ల్యూబీడీ-II 54.66, పీడబ్ల్యూబీడీ-III 40.66, పీడబ్ల్యూబీడీ -V 40.66 చొప్పున నిర్ణయించారు.
- అలాగే, సివిల్స్ మెయిన్ పరీక్షలో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు 739 కాగా.. ఈడబ్ల్యూఎస్ 706, ఓబీసీ 717, ఎస్సీ 700, ఎస్టీ 694, పీడబ్ల్యూబీడీ-I 703, పీడబ్ల్యూబీడీ-II 708, పీడబ్ల్యూబీడీ-III 536, పీడబ్ల్యూబీడీ -V 451 మార్కులుగా ఉంది.
- తుది పరీక్షలో జనరల్ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు 963 కాగా.. ఈడబ్ల్యూఎస్ 926, ఓబీసీ 931, ఎస్సీ 905, ఎస్టీ 902, పీడబ్ల్యూబీడీ-I 917, పీడబ్ల్యూబీడీ-II 944, పీడబ్ల్యూబీడీ-III 804, పీడబ్ల్యూబీడీ -V 631గా ఉన్నట్లు యూపీఎస్సీ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.