SSC Hall Tickets 2026 | తెలంగాణ, ఏపీ టెన్త్‌ హాల్‌టికెట్లు విడుదల.. వాట్సప్‌లోనే పొందండి ఇలా..!

SSC Hall Tickets 2026 | తెలంగాణ, ఏపీ టెన్త్‌ హాల్‌టికెట్లు విడుదల.. వాట్సప్‌లోనే పొందండి ఇలా..!

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు (SSC Exams Hall Tickets 2026) విడుదలయ్యాయి. తెలంగాణలో మార్చి 14 నుంచే టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఏపీలో 16వ తేదీ నుంచి మొదలు కానున్నాయి.

Eenadu icon
By Education News Team Updated :05 Mar 2026 15:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు (SSC Exams Hall Tickets 2026) విడుదలయ్యాయి. తెలంగాణలో ఈ నెల 14 నుంచే టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఏపీలో 16వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు ఇంకా కొద్దిరోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆయా రాష్ట్రాల ఎస్‌ఎస్‌సీ బోర్డులు పరీక్షల హాల్‌టికెట్లను గురువారం విడుదల చేశాయి. రెగ్యులర్‌/ప్రైవేటు/ఓపెన్‌ ఎస్‌ఎస్‌సీ/ఒకేషనల్‌ విభాగాలకు చెందిన విద్యార్థుల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లలో వేర్వేరుగా అధికారులు అందుబాటులో ఉంచారు.

తెలంగాణలో విద్యార్థులు తమ హాల్‌టికెట్లను బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ bse.telangana.gov.in ద్వారా, ఏపీ విద్యార్థులు https://www.bse.ap.gov.in/ లో హాల్‌టికెట్లు పొందొచ్చు. అలాగే, ఏపీ విద్యార్థులు మనమిత్ర (వాట్సప్‌ నంబరు 9552300009) లేదా లీప్‌ యాప్‌ ద్వారా; తెలంగాణ విద్యార్థులు వాట్సప్‌ నంబర్‌ (8096958096) ద్వారా నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వద్ద కూడా హాల్‌టికెట్లను పొందవచ్చు.

తెలంగాణలో వాట్సప్‌లో డౌన్‌లోడ్‌ ఇలా..

  • తెలంగాణలో 8096958096 అనే వాట్సప్‌ నంబర్‌కు హాయ్‌ (Hi)  అని మెసేజ్‌ చేయండి.
  • మీ ఫోన్‌కి వెల్‌కమ్‌టూ మీ సేవ అని వస్తుంది.
  • చాట్‌లో SSC hall ticket march-2026  అని టైప్‌ చేసి మెసేజ్‌ చేయండి. 
  • మీ మొబైల్‌కు ఒక లింక్‌ వస్తుంది. ఆ లింక్‌ను ఓపెన్‌ చేసి జిల్లా, పాఠశాల పేరును ఎంచుకోండి.
  • విద్యార్థి పేరు, పుట్టిన తేదీ నమోదు చేస్తే హాల్‌టికెట్‌ మీ ఫోన్‌లోనే వచ్చేస్తుంది.
  • డౌన్‌లోడ్‌ చేసి భద్రపరుచుకోండి.

ఏపీలో వాట్సప్‌లో డౌన్‌లోడ్‌ ఇలా..

  • ఏపీలో అయితే మీ ఫోన్‌లో 95523 00009 నంబర్‌కు Hi అని మెసేజ్‌ పంపండి
  • సర్వీస్‌ సెలక్షన్‌ అనే ఆప్షన్‌ వస్తుంది
  • ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ను ఎంచుకోండి
  • అక్కడ ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్ అనే ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోండి 
  • అప్లికేషన్‌ నంబర్‌/చైల్డ్‌ ఐడీతో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయాలి
  • రెగ్యులర్‌/ప్రైవేటు/ఓఎస్ఎస్‌సీ రెగ్యులర్‌/ఒకేషనల్‌లలో మీకు సంబంధించిన కేటగిరీని ఎంచుకొని కన్‌ఫర్మ్‌ చేయండి.
  • ఆ తర్వాత కొద్ది నిమిషాలకు హాల్‌టికెట్‌ మీ వాట్సప్‌ నంబర్‌కే వచ్చేస్తుంది. 
  • డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రింట్‌ తీసి భద్రపరుచుకోండి.