AP 10th Calss Hall Tickets 2026 | ఏపీలో టెన్త్ హాల్‌టికెట్లు ఎప్పుడంటే? వాట్సప్‌లో డౌన్‌లోడ్ ఇలా..!
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానుండటంతో హాల్‌టికెట్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది.
By Education News Team
Updated :04 Mar 2026 19:44 IST
https://results.eenadu.net/education-news/key-update-on-AP-SSC-exams-hall-tickets-download
ఇంటర్నెట్ డెస్క్: ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానుండటంతో విద్యార్థులంతా హాల్‌టికెట్ల కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు బుధవారం సాయంత్రం కీలక అప్‌డేట్ ఇచ్చారు. పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్ల (AP SSC Hall tickets)ను గురువారం (మార్చి 5న) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి బుధవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/తో పాటు మనమిత్ర (వాట్సప్ నంబరు 9552300009) లేదా లీప్ యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వద్ద కూడా హాల్‌టికెట్లను పొందవచ్చని సూచించారు.
వాట్సప్‌లో డౌన్‌లోడ్ ఇలా..
- మీ ఫోన్‌లో 95523 00009 నంబర్‌ను సేవ్ చేసుకోండి
- అందులో Hi అని మెసేజ్ పంపండి
- సర్వీస్ సెలక్షన్ అనే ఆప్షన్ వస్తుంది
- ఎడ్యుకేషన్ సర్వీసెస్‌ను ఎంచుకోండి
- అక్కడ ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి
- అప్లికేషన్ నంబర్/చైల్డ్ ఐడీతో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి
- రెగ్యులర్/ప్రైవేటు/ఓఎస్ఎస్‌సీ రెగ్యులర్/ఒకేషనల్‌లలో మీకు సంబంధించిన కేటగిరీని ఎంచుకొని కన్‌ఫర్మ్ చేయండి.
- ఆ తర్వాత కొద్ది నిమిషాలకు హాల్‌టికెట్ మీ వాట్సప్ నంబర్‌కే వచ్చేస్తుంది.
- డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసి భద్రపరుచుకోండి.