JEE Main 2026 Mocktests | గూగుల్‌ జెమినైలో ‘జేఈఈ మెయిన్‌’ మాక్‌ టెస్టులు.. మీరు ట్రైచేశారా? 

JEE Main 2026 Mocktests | గూగుల్‌ జెమినైలో ‘జేఈఈ మెయిన్‌’ మాక్‌ టెస్టులు.. మీరు ట్రైచేశారా? 

జేఈఈ మెయిన్‌ (JEE Main 2026) సెషన్‌- 1 ఫలితాలు ఇటీవల వెలువడగా.. జేఈఈ మెయిన్‌ సెషన్‌- 2లో మరింత మెరుగైన స్కోరు కోసం సాధించాలనే పట్టుదలతో విద్యార్థులు ప్రిపరేషన్‌ కొనసాగిస్తున్నారు.

Eenadu icon
By Education News Team Updated :26 Feb 2026 20:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జేఈఈ మెయిన్‌ (JEE Main 2026) సెషన్‌- 1 ఫలితాలు ఇటీవల వెలువడగా.. జేఈఈ మెయిన్‌ సెషన్‌- 2లో మరింత మెరుగైన స్కోరు కోసం సాధించాలనే పట్టుదలతో విద్యార్థులు ప్రిపరేషన్‌ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో విడత పరీక్షల పరీక్షలు రాసే అభ్యర్థులకు గూగుల్‌ (Google) అద్భుతమైన అవకాశం కల్పించింది. తన ఏఐ ప్లాట్‌ఫాం ‘జెమినై’లో జేఈఈ మెయిన్‌ పరీక్షకు సంబంధించిన పూర్తిస్థాయిలో ఉచిత మాక్‌ టెస్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల అమెరికాలో శాట్‌ (SAT) పరీక్షల ప్రాక్టీస్‌ టెస్టులను అందుబాటులోకి తీసుకొచ్చిన గూగుల్‌.. అదే తరహాలో భారత్‌లో జేఈఈ మెయిన్‌ అభ్యర్థులకు మాక్‌ టెస్టులను అందిస్తుండటం విశేషం. ఐఐటీలు/ఎన్‌ఐటీలు వంటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే జేఈఈ మెయిన్‌ పరీక్ష ఎంతో కఠినంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.

‘జెమినై’లో ఇలా ట్రై చేయండి..

  • గూగుల్‌ జెమినైలోకి వెళ్లి Generate JEE Main practice test అని ఎంటర్‌ చేయాలి.
  • మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులు వేర్వేరుగా డిస్‌ప్లే అవుతాయి.
  • ఒక్కో సబ్జెక్టుకు 25 ప్రశ్నలు చొప్పున అడుగుతారు.
  • మొత్తం 3గంటల వ్యవధిలో ఈ టెస్టు రాయాల్సి ఉంటుంది. 
text......

ఈ మాక్‌ టెస్టులను రాయడం ద్వారా విద్యార్థులకు పరీక్షకు సంబంధించి రియల్‌ టైం అనుభవంతో పాటు పరీక్షలో వేగం, కచ్చితత్వం పెరుగుతుంది. రాసిన ప్రతి మాక్‌టెస్టునీ లోతుగా విశ్లేషించుకోవడం ద్వారా చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకొనేందుకు ఇదో సువర్ణావకాశం. ఎక్కడ వెనకబడి ఉన్నారో, సమయం ఎక్కడ వృథా అవుతుందో గుర్తించి తదనుగుణంగా మీ స్ట్రైక్‌ రేట్‌ని మెరుగుపరుచుకొనేలా  తదుపరి ప్రిపరేషన్‌ను ప్లాన్‌ చేసుకొవడం ద్వారా  ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు.