GATE 2026 Key| గేట్ ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

GATE 2026 Key| గేట్ ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE 2026) పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ విడుదలైంది.

Eenadu icon
By Education News Team Published :22 Feb 2026 14:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE 2026) పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ విడుదలైంది. ఈ కీతో పాటు రెస్పాన్స్‌ షీట్లు, మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్లను ఐఐటీ గువాహటి ( IIT Guwahati) అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. గేట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, తదితర వివరాలను ఎంటర్‌ చేసి ఆన్సర్‌ కీ, క్వశ్చన్‌పేపర్‌, రెస్పాన్స్‌ షీట్‌లను పొందొచ్చు. 

ఆన్సర్‌ కీ కోసం క్లిక్‌ చేయండి

దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో గేట్‌ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాల(GATE Exam Results)ను మార్చి 19న విడుదల చేయనున్నట్లు అధికారులు షెడ్యూల్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.