AP DEECET Result: ఏపీ డీఈఈసెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి
రాష్ట్రంలో రెండేళ్ల డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి.
Published : 30 May 2024 15:05 IST
https://results.eenadu.net/news.aspx?newsid=30052024
అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా విద్య, శిక్షణ సంస్థల్లో రెండేళ్ల డీఈడీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన డీఈఈ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మే 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 4,949మంది హాజరు కాగా.. వీరిలో 3,191మంది ఉత్తీర్ణత సాధించినట్లు డీఈఈ సెట్ కన్వీనర్ వెల్లడించారు. డీఈఈసెట్ రెస్పాన్స్‌షీట్, ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ కోసం అభ్యర్థి ఐడీ, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి.
ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి
మ్యాథమెటిక్స్ విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన బులుసు గ్రీష్మిత, ఫిజిక్స్ విభాగంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కేసన మీనాక్షి, బయాలాజికల్ సైన్స్ విభాగంలో కడప జిల్లాకు చెందిన షేక్ రుక్సానా, సాంఘిక శాస్త్రం విభాగంలో చిత్తూరు జిల్లాకు చెందిన గుత్తా సునీల్ కుమార్ మొదటి ర్యాంకులు సాధించారని తెలిపారు. జూన్ 6 నుంచి 8వరకు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 20 నుంచి కోర్సు ప్రారంభమవుతుందిన అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.