JEE Main 2025 Application | జేఈఈ మెయిన్ దరఖాస్తుకు డైరెక్ట్ లింక్..  సిలబస్ ఇవిగో!
        
        జేఈఈ మెయిన్ 2025 పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ కింది లింక్‌లపై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
     
    
    
        Published :29 Oct 2024 15:11 IST
        
            
            
            
                
                
                
                    https://results.eenadu.net/news.aspx?newsid=29102024
                    
                 
             
            
            
            
         
        
     
    
    JEE Main 2025 | ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్/బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ (మెయిన్) 2025 పరీక్షకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన విద్యార్థులు నవంబర్ 22 రాత్రి 9గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం నవంబర్ 22 రాత్రి 11.50గంటల వరకు చెల్లించవచ్చు. సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను జనవరి తొలి వారంలో విడుదల చేస్తారు. జనవరి 22-31 తేదీల మధ్య పరీక్ష నిర్వహిస్తారు. తొలి విడత పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 12కల్లా ప్రకటిస్తారు.
జేఈఈ మెయిన్, నీట్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఇదిగో సువర్ణావకాశం!
JEE Main 2025 examను ఏటా రెండు విడతల్లో నిర్వహిస్తుండగా.. జనవరి 22 నుంచి 31 తేదీల మధ్య తొలి విడత, ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీల మధ్య రెండో విడత పరీక్షలు జరగనున్నాయి. JEE Main 2025 ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను జాతీయ పరీక్షల సంస్థ(NTA) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా JEE Main 2025 సిలబస్‌తో పాటు ఈ పరీక్షకు సంబంధించిన సకల సమాచారంతో కూడిన బుక్‌లెట్‌ను విడుదల చేసింది.
జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి 
సిలబస్ కోసం క్లిక్ చేయండి