SSC JE Exam Marks | ఎస్‌ఎస్‌సీ జేఈ పేపర్-1 పరీక్ష రాశారా? ఫైనల్ కీ, మార్కుల కోసం క్లిక్ చేయండి
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన జేఈ ఉద్యోగ నియామక పరీక్ష పేపర్ 1 రాసిన వారు ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి తమ మార్కులు, తుది కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Published :(23 August 2024 00:10) IST
https://results.eenadu.net/news.aspx?newsid=23082024
SSC Recruitment| దిల్లీ: 1,765 జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల భర్తీకి నిర్వహించిన పేపర్-1 పరీక్ష ఫలితాలను రెండ్రోజుల క్రితమే ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. తాజాగా ఈ పరీక్ష తుది కీ, రెస్పాన్స్ షీట్లు, మార్కులను విడుదల చేసింది. ఈ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ఈ లింక్‌పై క్లిక్ చేసి లాగిన్‌లో తమ రోల్ నెంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయడం ద్వారా వీటిని పొందొచ్చు. ఈ పరీక్షలో క్వాలిఫై/నాన్-క్వాలిఫై అభ్యర్థులు సైతం తమ రిజిస్టర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి ఆగస్టు 22నుంచి సెప్టెంబర్ 5 సాయంత్రం 6గంటల వరకు మార్కులు తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇవి నిర్ణీత సమయంలోనే అందుబాటులో ఉన్నందున అభ్యర్థులు తమ ప్రశ్నపత్రం, రెస్పాన్స్ షీట్‌లతో కూడిన ఫైనల్ కీ, స్కోర్ కార్డులను ప్రింటవుట్ తీసి భద్రపరుచుకోవాలని సూచించింది.
ఫైనల్ కీ, మార్కుల కోసం క్లిక్ చేయండి
సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్/మెకానికల్ విభాగాల్లో కలిపి మొత్తంగా 16,223 మంది అభ్యర్థులు పేపర్-2 రాసేందుకు షార్ట్‌లిస్ట్ అయినట్లు ఇటీవల ఎస్‌ఎస్‌సీ వెల్లడించింది. పేపర్-2 పరీక్ష పూర్తయిన తర్వాత షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు దేశ వ్యాప్తంగా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ బి (నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజినీర్ పోస్టుల్లో నియమితులు కానున్న విషయం తెలిసిందే.