TGPSC Group 2Exams schedule | తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షల కొత్త షెడ్యూల్‌ వచ్చేసింది

TGPSC Group 2Exams schedule | తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షల కొత్త షెడ్యూల్‌ వచ్చేసింది

TGPSC Group 2Exams schedule | తెలంగాణలో గ్రూప్‌ 2 పరీక్షలకు కొత్త షెడ్యూల్ విడుదలైంది.

Published :22 August 2024 16:05 IST

TGPSC Group 2Exam| హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ వచ్చేసింది. డిసెంబర్‌ 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ (TGPSC) గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లోనే జరగాల్సి ఉంది. కానీ, డీఎస్సీ, గ్రూప్‌ -2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో గ్రూప్‌ 2 పరీక్షలను డిసెంబర్‌కు రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు ప్రకటించిన టీజీపీఎస్సీ.. తాజాగా పరీక్షల షెడ్యూల్‌ని విడుదల చేసింది. మొత్తం 783 గ్రూప్‌- 2 పోస్టులకు 5.51లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఈ 21 యూనివర్సిటీలు ఫేక్‌.. అవి ఇచ్చే డిగ్రీలు చెల్లవ్‌!

కొత్త షెడ్యూల్‌ ప్రకారం.. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10గంటల నుంచి 12.30గంటల వరకు ఒక సెషన్‌, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5.30గంటలవరకు రెండో సెషన్‌లో పరీక్షలు జరుగుతాయని టీజీపీఎస్సీ కార్యదర్శి డా.ఇ. నవీన్‌ నికోలస్‌ వెల్లడించారు. ఈ పరీక్షలు ప్రారంభానికి వారం రోజుల ముందునుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు.