Fake Universities: ఈ 21 యూనివర్సిటీలు ఫేక్‌.. అవి ఇచ్చే డిగ్రీలు చెల్లవ్‌!

Fake Universities: ఈ 21 యూనివర్సిటీలు ఫేక్‌.. అవి ఇచ్చే డిగ్రీలు చెల్లవ్‌!

UGC: దేశంలో 21 నకిలీ యూనివర్సిటీల జాబితాను యూజీసీ ఇటీవల విడుదల చేసింది. యూజీసీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2024 మే నాటికి ఉన్న నకిలీ యూనివర్సిటీల జాబితా ఇదే..

Published :21 August 2024 15:09 IST

Fake Universities| దిల్లీ: దేశ వ్యాప్తంగా 21 యూనివర్సిటీలు నకిలీవిగా ఉన్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇలాంటి వర్సిటీలు దిల్లీలో అత్యధికంగా ఎనిమిది ఉండగా.. యూపీలో నాలుగు, ఏపీ, బెంగాల్‌, కేరళలో రెండేసి, కర్ణాటక, మహారాష్ట్ర, పుదుచ్చేరిలలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్టు తెలిపింది. గతేడాది దేశంలో 20 నకిలీ యూనివర్సిటీలు ఉండగా.. 2024 మే నాటికి వాటి సంఖ్య 21కి చేరింది. ఈ నకిలీ వర్సిటీలకు డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లేదని గతంలోనే యూజీసీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. యూజీసీ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఇలాంటి విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే డిగ్రీలను ఉన్నత విద్య, ఉద్యోగ ప్రయోజనాల కోసం గుర్తించబోమని.. ఆ డిగ్రీలు చెల్లుబాటు కావని UGC ఇప్పటికే తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులోని కాకుమానివారితోటలో క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ; విశాఖలోని బైబిల్ ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ ఇండియాను నకిలీవిగా యూజీసీ ప్రకటించింది. ఫేక్‌ యూనివర్సిటీల పూర్తి వివరాలతో కూడిన జాబితా కోసం క్లిక్‌ చేయండి. ఈ వర్సిటీల పట్ల అప్రమత్తంగా ఉండండి.

అన్నింటా మేటి.. ఐఐటీ మద్రాస్‌ గురించి తెలుసా?

దిల్లీలో ఫేక్‌ యూనివర్సిటీలు (8)..

  • ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్ అండ్‌ ఫిజికల్‌ హెల్త్‌ సైన్సెస్‌ (AIIPHS)
  • కమర్షియల్‌ యూనివర్సిటీ లిమిటెడ్‌- దర్యాగంజ్‌
  • యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్సిటీ
  • వొకేషనల్‌ యూనివర్సిటీ
  • ఏడీఆర్‌ - సెంట్రిక్‌ జ్యూరిడికల్‌ యూనివర్సిటీ
  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌
  •  విశ్వకర్మ ఓపెన్‌ యూనివర్సిటీ ఫర్‌ సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌;
  • ఆధ్యాత్మిక్‌ విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం)

ఉత్తరప్రదేశ్‌లో (4)

  • గాంధీ హిందీ విద్యాపీఠ్‌, ప్రయాగ్‌రాజ్‌
  • నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ యూనివర్సిటీ (ఓపెన్‌ యూనివర్సిటీ)
  • భారతీయ శిక్షా పరిషత్‌ 
  • మహామయ టెక్నికల్‌ యూనివర్సిటీ

 పశ్చిమబెంగాల్‌లో(2)..

  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌
  • ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చి

కేరళలో (2)

  • సెయింట్‌ జాన్స్‌ యూనివర్సిటీ (కేరళ)
  • ఇంటర్నేషనల్‌ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్‌ ప్రొఫెటిక్‌ మెడిసిన్‌ (IIUPM)
  • బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ (కర్ణాటక)
  • రాజా అరబిక్‌ యూనివర్సిటీ (మహారాష్ట్ర)
  • శ్రీ బోధి అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (పుదుచ్ఛేరి)