AP SSC Halltickets : ఏపీలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు.. డౌన్‌లోడ్ ఇలా..
ఏపీలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.
Published : 21 May 2024 17:15 IST
https://results.eenadu.net/news.aspx?newsid=21052024
అమరావతి: ఏపీలో మే 24 నుంచి జూన్ 3 వరకు జరగనునన పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షలను 1,61,877 మంది హాజరుకానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి వెల్లడించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు తమ జిల్లా పేరు, పాఠశాల పేరు, తమ పేరు, పుట్టిన తేదీ వివరాలను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి
ఓపెన్ స్కూల్ సొసైటీ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి