JEE Advanced Admit cards: జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి.
Published : 17 May 2024 14:30 IST
https://results.eenadu.net/news.aspx?newsid=17052024
చెన్నై: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 పరీక్షకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మే 26న జరగనున్న ఈ పరీక్ష అడ్మిట్ కార్డులను ఐఐటీ మద్రాస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్డుల్ని మే 26న మధ్యాహ్నం 2.30గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్ష పేపర్ -1 ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు; పేపర్ -2 మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరగనుంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసిన విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను మే 31 నుంచి అందుబాటులో ఉంచుతారు. ప్రాథమిక కీ జూన్ 2న విడుదల చేసి తుది కీ, ఫలితాలను జూన్ 9న ప్రకటిస్తారు. ఈ పరీక్షలో ర్యాంకులు సాధించిన వారికి దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఇతర ప్రఖ్యాత యూనివర్సిటీల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి