telangana dsc 2024 applications date extended

TS DSC 2024 Exam: తెలంగాణ డీఎస్సీ పరీక్ష తేదీలు ఖరారు.. దరఖాస్తుల గడువు పొడిగింపు

తెలంగాణలో డీఎస్సీ దరఖాస్తుల గడువును పొడిగించిన అధికారులు.. పరీక్ష తేదీలను ఖరారు చేశారు.

Updated : 13 Mar 2024 12:18 IST

హైదరాబాద్‌: తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ (TS DSC 2024) పరీక్షకు దరఖాస్తుల గడువును విద్యాశాఖ పొడిగించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆన్‌లైన్‌ అప్లికేషన్లకు నేటితో గడువు ముగియగా.. జూన్‌ 20 వరకు పొడిగించింది. దీంతో అభ్యర్థులు రూ.1000 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించి జూన్‌ 20 రాత్రి 11.50గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. అలాగే, డీఎస్సీ పరీక్ష తేదీలనూ అధికారులు ఖరారు చేశారు. జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. వీటిలో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్‌ అసిస్టెంట్‌, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా.. ఆ తర్వాత అత్యధికంగా నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు.