AP RGUKT : ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల
ఏపీలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల ప్రొవిజనల్ జాబితా విడుదలైంది.
Published :11072024 IST
https://results.eenadu.net/news.aspx?newsid=11072024
ఇంటర్నెట్ డెస్క్: ఏపీలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ల్లో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్ జాబితా విడుదలైంది. ఎంపికైన విద్యార్థులకు నూజివీడు, ఇడుపులపాయ (ఆర్కే వ్యాలీ)లలో జులై 22, 23 తేదీల్లో; ఒంగోలులో జులై 24, 25 తేదీల్లో; శ్రీకాకుళంలో జులై 26, 27 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నారు.
నూజివీడు ట్రిపుల్ ఐటీకి ఎంపికైన అభ్యర్థుల జాబితా
ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ) ట్రిపుల్ ఐటీకి ఎంపికైన అభ్యర్థుల జాబితా
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ఎంపికైన అభ్యర్థుల జాబితా
ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ఎంపికైన అభ్యర్థుల జాబితా
ఆగస్టు తొలి వారంలోనే తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది. కచ్చితమైన తేదీలను అధికారులు త్వరలోనే ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ల్లో ప్రవేశాల కోసం 53,863 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపికైన విద్యార్థుల వివరాలను చూస్తే.. ఏపీ నుంచి 3982 మంది, తెలంగాణ నుంచి 58, ఇతర రాష్ట్రాల నుంచి 22మంది చొప్పున ఉన్నారు. ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు హాస్టల్ వసతి ఉంటుంది.
20 మంది టాపర్లు వీరే..