TGPSC Group-2 Halltickets | గ్రూప్- 2 పరీక్ష హాల్‌టికెట్లు విడుదల.. జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు ఇవిగో!
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల(TGPSC Group 2 Exams) హాల్ టికెట్లు విడుదలయ్యాయి.
Published :09 Dec 2024 14:49 IST
https://results.eenadu.net/news.aspx?newsid=09122024
Group 2 Halltickets| ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల(TGPSC Group 2 Exams) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. డిసెంబర్ 15, 16 తేదీల్లో జరగనున్న ఈ పరీక్షల హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ(TGPSC) తన అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంచింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 783 గ్రూప్- 2 పోస్టులను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పోస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి
హాల్ టికెట్లు (TGPSC Group-2 Hall Tickets) డౌన్‌లోడ్ కోసం అభ్యర్థులు తమ టీజీపీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ వివరాలతో పాటు అక్కడ ఉన్న క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు వీలుగా జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు (పని దినాల్లో మాత్రమే) ఈ నంబర్లను సంప్రదించొచ్చు. ఇంకా ఏదైనా సమాచారం కోసం టీజీపీఎస్సీ హెల్ప్‌లైన్ నంబర్లు 040-22445566/ 23542185/23542187కు కాల్ చేయొచ్చు. లేదా helpdesk@tspsc.gov.inకు ఈ-మెయిల్ చేయవచ్చు.
జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..