NEET UG 2024 Results out I నీట్‌ (యూజీ) ఫలితాలు వచ్చేశాయ్‌.. స్కోర్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి

NEET UG Results: నీట్‌ (యూజీ) ఫలితాలు వచ్చేశాయ్‌.. స్కోర్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి

దేశ వ్యాప్తంగా వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ (యూజీ) ఫలితాలు విడుదలయ్యాయి.

Published : 04 June 2024 20:00 IST

NEET UG Results | దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ (NEET UG 2024) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 12న విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ.. ఎన్‌టీఏ అధికారులు మంగళవారం సాయంత్రమే విడుదల చేశారు. ఇటీవల ప్రిలిమినరీ కీ విడుదల చేసి మే 31వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు ఆన్‌లైన్‌ అభ్యంతరాలు స్వీకరించిన విషయం తెలిసిందే.  తాజాగా ఫలితాలు, ఫైనల్‌ కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. స్కోర్‌ కార్డును పొందేందుకు అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

నీట్‌ స్కోర్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి

ఫైనల్‌ కీ కోసం క్లిక్‌ చేయండి

దేశంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ (MBBS), బీడీఎస్‌ (BDS), బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం  మే 5న నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 24లక్షల మంది హాజరైన విషయం తెలిసిందే.