TG TET Results | తెలంగాణ టెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌..

TG TET Results | తెలంగాణ టెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌..

తెలంగాణ టెట్ ఫలితాలు (TG TET Results) విడుదలయ్యాయి.

Eenadu icon
By Education News Team Updated :10 Feb 2026 21:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తెలంగాణ టెట్ ఫలితాలు (TG TET 2026 Results) విడుదలయ్యాయి. జనవరి 3 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరగ్గా.. మంగళవారం రాత్రి పాఠశాల విద్యాశాఖ అధికారులు ఫలితాలను ప్రకటించారు. ఇటీవల టెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల చేసిన అధికారులు.. ఫిబ్రవరి 1 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన విషయం తెలిసిందే. తాజాగా ఫలితాలతో పాటు తుది కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ జర్నల్‌ నంబర్‌/హాల్‌టికెట్‌ నంబర్‌, పేపర్‌ని సెలక్ట్‌ చేసుకొని, పుట్టిన తేదీ ఎంటర్‌ చేసి రిజల్ట్స్‌ పొందొచ్చు.

టెట్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

టెట్‌ పేపర్‌ 1, పేపర్‌ 2కు కలిపి దాదాపు 2.37లక్షలకు పైగా దరఖాస్తులు రాగా.. వీటిలో 71,670మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు ఉన్నారు. మొత్తంగా టెట్‌ పరీక్షకు 1,95,181 మంది హాజరు కాగా.. వీరిలో 65,605 మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. టెట్‌ పరీక్షలో మొత్తంగా 1,00,270 మంది(51.37శాతం) క్వాలిఫై కాగా.. అందులో 37,893 మంది (57.76%)ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులు అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.

టెట్‌ ఫైనల్‌ కీ కోసం క్లిక్‌ చేయండి