TGCET–2026 Hall tickets | గురుకుల టీజీసెట్‌ హాల్‌టికెట్లు విడుదల

TGCET–2026 Hall tickets | గురుకుల టీజీసెట్‌ హాల్‌టికెట్లు విడుదల

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఐదోతరగతి ప్రవేశాలకు నిర్వహించనున్న TGCET–2026కు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.

Eenadu icon
By Education News Team Updated :12 Feb 2026 20:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఐదోతరగతి ప్రవేశాలతో పాటు 6, 7, 8, 9వ తరగతి రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీకి నిర్వహించనున్న తెలంగాణ గురుకులం కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TGCET–2026)కు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 22న జరిగే ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ క్యాండిడేట్‌ ఐడీ/పేరు/మొబైల్‌ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ వివరాలను వెబ్‌సైట్‌లో ఎంటర్‌ చేసి తమ హాల్‌టికెట్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డిసెంబర్‌ 12 నుంచి జనవరి 25వరకు టీజీసెట్‌కు దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. విద్యార్థులు త్వరగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకొని పరీక్షకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని గురుకుల సెట్‌ చీఫ్‌ కన్వీనర్, ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్య సూచించారు.

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏవైనా సమస్యలు తలెత్తితే 040-23120431, 040-23120432 నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. సెలవు రోజుల్లో మినహా ఎప్పుడైనా ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు; మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ హెల్ప్‌ డెస్క్‌ పనిచేస్తుందని పేర్కొన్నారు.