AISSEE 2026 key| సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష రాశారా? ప్రొవిజినల్ ఆన్సర్ కీ ఇదిగో!
జనవరి 18న నిర్వహించిన ఆలిండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష (AISSEE 2026) ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదలైంది.
By Education News Team
Updated :12 Feb 2026 14:56 IST
https://results.eenadu.net/education-news/AISSEE-2026-provisional-answer-key-released
ఇంటర్నెట్ డెస్క్: ఆలిండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష (AISSEE 2026) ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదలైంది. ఈ కీతో పాటు ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను ఎన్‌టీఏ(NTA) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఈ కీ, రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈలోగా అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి
ప్రొవిజినల్ ఆన్సర్ కీపై ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్తాలనుకుంటే.. ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఛాలెంజ్ చేసిన ప్రశ్నలను నిపుణుల ప్యానెల్ వెరిఫై చేస్తుంది. లేవనెత్తిన అంశం సరైందని తేలితే ఆన్సర్‌ని తదనుగుణంగా సవరిస్తారు. ఫైనల్ కీలో మార్పులు అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు.
సైనిక పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలు కల్పించేందుకు దేశ వ్యాప్తంగా జనవరి 18న AISSEE 2026 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రొవిజినల్ ఆన్సర్ కీపై ఏవైనా ఏవైనా సందేహాలు ఉంటే 011-40759000 లేదా 011-69227700కు కాల్ చేసి సంప్రదించవచ్చు. లేదంటే aissee@nta.ac.inకు మెయిల్ చేయొచ్చని అధికారులు సూచించారు.