JEE Main 2026 | జేఈఈ మెయిన్‌ ఫలితాలపై NTA కీలక అప్‌డేట్‌.. రిజల్ట్స్‌ ఎప్పుడంటే?

JEE Main 2026 | జేఈఈ మెయిన్‌ ఫలితాలపై NTA కీలక అప్‌డేట్‌.. రిజల్ట్స్‌ ఎప్పుడంటే?

జేఈఈ మెయిన్‌ (సెషన్‌-1) ఫలితాల(JEE Main 2026 Results) విడుదలకు సంబంధించి ఎన్‌టీఏ (NTA) కీలక అప్‌డేట్‌ ఇచ్చింది.

Eenadu icon
By Education News Team Updated :11 Feb 2026 22:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జేఈఈ మెయిన్‌ (సెషన్‌-1) ఫలితాల(JEE Main 2026 Results) విడుదలకు సంబంధించి ఎన్‌టీఏ (NTA) కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ ఫలితాలను ఫిబ్రవరి 16నాటికి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ నోట్‌ను విడుదల చేసింది. తొలుత షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రకారం జేఈఈ మెయిన్‌ తుది కీ (JEE Main Final key),  ఫలితాలు (Results) ఫిబ్రవరి 12 నాటికి విడుదల చేయాల్సి ఉంది. దీంతో బుధవారం రాత్రి లేదా గురువారం నాటికి ఫలితాలు వస్తాయని దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న క్రమంలో ఎన్‌టీఏ తాజా అప్‌డేట్‌ ఇచ్చింది.

మరోవైపు, ప్రస్తుతం జేఈఈ మెయిన్‌ మలి విడత పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 25వ తేదీ రాత్రి 9గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 2 నుంచి 9 వరకు జరగనున్న విషయం తెలిసిందే.